కొత్తగా సబ్ స్టేషన్ లు మంజూరు

వినియోగదారులకు మరింత మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా సబ్ స్టేషన్ లు మంజూరు

– సూపెరింటెండింగ్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9 (అఖండ భూమి న్యూస్);

వినియోగదారులకు మరింత మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా కామారెడ్డి సర్కిల్ పరిధిలో సబ్ స్టేషన్ లు మంజూరు అయ్యాయని వాటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయాని కామారెడ్డి సూపెరింటెండింగ్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1) చిట్యాల, తాడ్వాయి మండలం ,2) మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండలం, 3) బొర్లం, బాన్సువాడ మండలం, అందులో 2 సబ్స్టేషన్ ( చిట్యాల, మహమ్మద్ నగర్) పనులు ముమ్మరంగా జరుగుతున్నవి, ఒక సబ్స్టేషన్ (బోర్లాం) టెండర్ ప్రాసెస్ లో ఉందని కామారెడ్డి సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఎన్. శ్రావణ్ కుమార్ బుధవారం తెలిపారు. డిమాండ్ కు అనుగుణంగా అవసరం ఉన్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్ లు నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఎటువంటి లోవోల్టేజ్ సమస్య ఉండదని. సమర్థవంతంగా విద్యుత్ పంపిణీ మరింత మెరుగుపడుతుందని వివరించారు . మౌలిక వసతుల అభివృద్ధికి అనుగుణంగా కొత్తసబ్ స్టేషన్ ల రాకతో రైతులకు, వినియోగదారులకు అంతరాయాలు తగ్గుతాయని స్పష్టం చేశారు . పొడవాటి ఫీడర్లు ఉండవని , ఫీడర్ నష్టాలు తగ్గుతాయని తెలిపారు . ఉన్న సబ్ స్టేషన్ల పై లోడ్ భారం తగ్గుతుందని, తద్వారా మెరుగైన, నిరంతరాయ సరఫరా అందించగలుగుతామని చెప్పారు . నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను తీర్చడానికి, ఈ నూతన సబ్ స్టేషన్ లు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.ఈ నూతన సబ్ స్టేషన్ ల వలన, నూతన వ్యవసాయ కనెక్షన్ లు త్వరిత గతిన మంజూరు అయ్యే అవకాశం ఉంటుందని తెలియచేశారు. సాగు, గృహ, వాణిజ్య అవసరాల కోసం, వినియోగదారులకు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి కొత్త సబ్ స్టేషన్ లు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు .

ఇందులో ఎస్ సి ఏ డి ఏ అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికతను అమలు చేయడం జరుగుతుందని , రియల్ టైం ఫీడర్ మానిటర్ ఉంటుందని , విద్యుత్ సంబంధిత పూర్తి సమాచారం తెలుసుకునే వీలుంటుందని అన్నారు .

Akhand Bhoomi News

error: Content is protected !!