సిఐటియు ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె విజయవంతం…

సిఐటియు ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె విజయవంతం…

*కామారెడ్డిలో ర్యాలీ అనంతరం మున్సిపల్ ముందు బహిరంగ సభ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9 (అఖండ భూమి న్యూస్);

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వ హించి అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. *ఈ సభకి ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర నాయకులు పాలడుగు సుధాకర్ హాజరై మాట్లాడుతూ. కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని దాన్లో భాగంగానే నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని అన్నారు. రానున్న రోజుల్లో కార్మికులను ఉద్యోగులను ప్రభుత్వానికి యాజమాన్యానికి బానిసలుగా మార్చేందుకు ఈ కోడ్ లను తెచ్చారని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు రోజువారి పని దినం 12 గంటలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 282 ను తీసుకువచ్చి రోజు పది గంటలు కార్మికులతో పని చేయించాలని చూస్తున్నారని పూర్తిగా కార్మికుల హక్కులు కాలరాయటమే అని అన్నారు. వెంటనే 8 గంటల పని దినాన్ని కార్మికులకు కొనసాగించాలని అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. బ్యాంకింగ్ రైల్వేస్ ఎల్ఐసి లను కార్పొరేట్ శక్తులకు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కన్వీనర్ కె చంద్రశేఖర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు రాజనర్సు, దీవెన, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బాబాయ్, ఆశా వర్కర్స్ జిల్లా కార్యదర్శి రాజశ్రీ, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బాల నర్సు,, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కిష్ట గౌడ్, బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు సత్యం చంద్రమౌళి, మెడికల్ రిప్స్ నాయకులు రవీంద్రాచారి, ప్రేమ్ పెన్షనర్స్ అసోసియేషన్ విజయరామరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!