ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;జూలై 10. (అఖండ భూమి న్యూస్);
బీసీ, ఎస్సీ, ఎస్టి, జేఏసీ, రాష్ట్ర కన్వీనర్ డా, విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు కామరెడ్డి జిల్లా ఏవో కి వినతి పత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని జేఏసీ ద్వారా కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సభ్యులు నీల నాగరాజు(ముదిరాజ్ ) జిల్ల బీసీ సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 26,000 పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, దానిలో 22 లక్షల పైన బడుగు బలహీనవర్గాల పేద విద్యార్థులు పాఠశాలలో చదువుచున్నారు, వారికి ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలని , కామారెడ్డి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ, ఆద్వర్యంలో , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సభ్యులు నీల నాగరాజు (ముదిరాజ్) బీసీ సంఘం జిల్లాఅధ్యక్షులు . లక్ష్మణ్ ,బోలేశ్వర్,రాజు, గంగరాజు , రాజశేఖర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



