కల్తీ ఆయిల్ పై చర్యలు ఏవీ?

కల్తీ ఆయిల్ పై చర్యలు ఏవీ?

• జిల్లా కేంద్రములో విచ్చలవిడిగా అమ్మకాలు

• బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అతికించి కల్తీ ఆయిల్ విక్రయస్తున్నారా?

• చోద్యం చూస్తున్న ఫుడ్ సేఫ్టీ

విభాగం…

•తూ తూ మంత్రంగా తనిఖీలు

• మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా కొనసాగుతున్న వ్యాపారం…..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 12 (అఖండ భూమి న్యూస్);

మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా కొంతమంది దళారులు వంట నూనెలు యదేచ్చగా కల్తీ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు.ఏది మంచి నూనె ఏది కల్తీ నూనె అని

గుర్తుపట్టలేని స్థితిలో చిరు వ్యాపారులు ప్రజలు సతమత మవుతున్నారు.కామారెడ్డి జిల్లా కేంద్రములో ఉన్న కొంతమంది ఆయిల్ వ్యాపారులు కల్తీకి పాల్పడుతున్నారని గతములో చాలా వార్తల్లో వెలువడినప్పటికీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారు.

పేరు లేని ఆయిల్స్….

కొంత మంది స్వంతంగా ఆయిల్ మిషనరీస్ పెట్టుకొని లూస్ ఆయిల్ అమ్ముతున్నారు. లూస్ ఆయిల్ ప్యాకెట్లపై ఎలాంటి కంపెనీ పేరు కానీ తయారూ చేసిన చిరునామకాని తెలుపకుండానే విక్రయిస్తున్నారు.ప్యాకెట్ల పై ఎక్స్ఫెయిరీ డేట్ ధరను సూచించే లేబుల్ లేకుండానే అమ్ముతున్నారు.

ప్రజల అవసరాన్ని వారు సొమ్ముగా మలుచుకుంటున్నారు.

కబేళాల నుండి బోన్ ఆయిల్

గతములో కామారెడ్డి జిల్లాలో కబేళాల నుండి ఎముకల ఆయిల్ తయారు చేసి విక్రయిస్తున్నారనీ అధికారులు గుర్తించారు.కానీ వారిపై నిఘా పెట్టడం మరిచారని ప్రజలు అంటున్నారు.. మార్కెట్లో ఎ ఆయిల్ తయారు చేస్తున్నారో అనే విషయం తయారు చేసేవారికి తప్ప మిగతా వారికి తెలియదని వాపోతున్నారు.

జీర్ణ కోశ వ్యాధులు వచ్చే అవకాశాలు…

వంటనూనెల కల్తీతో జీర్ణ కోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని గతములో చాలా మంది వైద్యులు ప్రజలను అప్రమత్తం చేశారు. కల్తీ ఆయిల్ తో తయారయిన పదార్థాలను తిన్న వెంటనే చర్మం పై దురదలు ,అలర్జీ వస్తాయని వైద్యులు చెపుతున్నారు.

చోద్యం చూస్తున్న ఫుడ్ సేఫ్టీ విభాగం…

ఆహార పదార్థాలు,ఆయిల్ కల్తీల పై కల్తీని అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదు. సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు తనిఖీ చేసే అధికారం లేదు. ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ ను అమలు చేస్తున్న అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై అధికార ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

Akhand Bhoomi News

error: Content is protected !!