*మెడిసిటీ హాస్పిటల్, ఘనపూర్, మేడ్చల్, లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేట స్నేహబందు ఆధ్వర్యంలో మెగాఉచిత వైద్య శిభిరం …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 12 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట ఉర్దూ భవన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉదయం 09గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం శనివారం నిర్వహించడం జరిగింది.
ఈ వైద్య శిభిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి,ముక్కు,గొంతు,
వరిబీజము,బీజకుట్టు,గడ్డలు,కనథులు,థైరాయిడ్ గడ్డలు,గర్భసంచికి సంబంధించిన సమస్యలు,కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు,చర్మ సమస్యలు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు 387 మంది పాల్గొన్నారు. 80 వేల రూపాయల విలువ గల మందులు ఉచితంగా పంపిణీ చేయటం జరిగింది. 65 మంది కంటి శాస్త్ర చికిత్స (ఆపరేషన్) త్వరలోనే ఉచితంగా చేస్తామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహబంధు హెల్త్ క్యాంప్ చైర్పర్సన్ దామోదర్ రావు, సభ్యులు హనుమంతరావు, బాలరాజు, శ్రీకాంత్, సాయి, సందీప్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


