మహంకాళి (చాముండేశ్వరి దేవి)కి పట్టు వస్త్రాలు సమర్పించిన షబ్బీర్ అలీ..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 13 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో స్థానిక మహంకాళి (చాముండేశ్వరి దేవి) బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ఆదివారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతర ఆలయ కమిటీ వారు శాలువా కప్పి, అమ్మ అమ్మ వారి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.