బీసీలకు రాజకీయంగా ప్రాముఖ్యత ఇచ్చేందుకే 42 శాతం రిజర్వేషన్లు..!
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 13 (అఖండ భూమి న్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన వెనుకబడిన తరగతుల కులాలకు ముందస్తుగా రేవంత్ రెడ్డి సర్కార్ 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం దోమకొండ మండల కేంద్రంలోని విజయ పాల శీతల కేంద్రం పూన ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడుతూ. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న బీసీ జనాభా దృష్టిలో ఉంచుకొని వారికి రాజకీయ రంగంతో పాటు అన్ని రంగాల్లో ప్రాముఖ్యత కల్పించాలని ఉద్దేశంతోనే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటా కుటుంబ సర్వే నిర్వహించి బీసీలు అత్యధికంగా ఉన్నారని వారికి కనీసం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిందన్నారు. అసెంబ్లీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆమోదం పొందిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు. దీనిపై బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు రిజర్వేషన్లపై వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా పార్టీలపై ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ప్రజలు సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి వివరించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బీసీ రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా అమలు చేసి ఉండేదని ఆయన అన్నారు. రాబోయేది రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
-
వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…