విజయ పాల మండల శీతల ఉత్పత్తి కేంద్రం పున ప్రారంభించిన షబ్బీర్ అలీ…

విజయ పాల మండల శీతల ఉత్పత్తి కేంద్రం పున ప్రారంభించిన షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 13 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో విజయపాల శీతల ఉత్పత్తి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం ప్రారంభించారు. గతంలో మూసివేసిన ఈ శీతల కేంద్రంలో మళ్లీ పునరుద్దిస్తు ప్రారంభించినట్లు తెలిపారు. శీతల కేంద్రంలో పరిసరాలలో మొక్కలు నాటి నీరు పోసినారు. ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరింత అభివృద్ధి చేయడానికి పై స్థాయి అధికారులకు వెల్లడించినట్లు తెలిపారు. పై అధికారులు సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, విజయ పాల డైరీ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!