ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంకు ఇసుక అనుమతులు ఇవ్వాలి…
అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 14 (అఖండ భూమి న్యూస్)
ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరకు అనుమతులు ఇవ్వాలని ఆటంకాలు కల్పించవద్దని దోమకొండ మండల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదేశాలు జారీ చేసినట్లు దోమకొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు ముదిరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక అనుమతులు ఇవ్వడం లేదని ఇసుక సరఫర లేక ఇండ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతుందనీ, లబ్ధిదారులు అవస్తలు పడుతున్నారని షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లినట్టు .ఇసుక సరఫర లేక ఇండ్ల నిర్మాణాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి షబ్బీర్ కి విన్న వించారు. ఇసుక అందుబాటులో లేక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతి మందగించిందదాంతో వెంటనే షబ్బీర్ అలీ తీసుకెళ్లగా దోమకొండ ఎంపిడిఓ ప్రవీణ్ ,ఎమ్మార్వో ఇతర అధికారులకు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత రాకుండా చూడాలని అనుమతులు ఇవ్వాలని ఆదేశించారను పేర్కొన్నారు. పేదల ఇల్ల నిర్మాణాలు ఆగిపోతున్నాయని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సీతారామ్ మధు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సలహాదారు షబ్బీర్ అలీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో దోమకొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, మాజీ సి డి సి చైర్మన్ ఐరేని నరసయ్య, విండో చైర్మన్ నాగరాజ్ రెడ్డి, రావులపల్లి నర్సారెడ్డి,అబ్రబోయిన రాజేందర్, అబ్రబోయిన రాజు, కొండ అంజయ్య, కొండ రాములు, అబ్రబోయిన రాజయ్య, నేతుల మల్లేశం యాదవ్, బొరేటి రాజు దోమకొండ గ్రామస్తులు పాల్గొన్నారు.