జాగృతి నాయకుల ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దగ్ధం
బెల్లంపల్లి జులై 14(అఖండ భూమి న్యూస్) :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసి తెలంగాణ ఆడపడుచులను అగర్వ పరిచడాన్ని నిరసిస్తూ సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను దహనం చేసిన జాగృతి నాయకులు.ఈసందర్భంగా జిల్లా నాయకులు ఇట రాకేష్ మాట్లాడుతూ… జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని, లేనియెడల తెలంగాణలో తీన్మార్ మల్లన్నను తీరగనియమని,తెలంగాణ ఆడపడుచులను అగర్వపరచిన మల్లన్న తెలంగాణ ఆడపడుచులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు శ్రీనాథ్,బండారి రేవంత్, కందుల స్వరాజ్,శ్రీనాథ్,మహంతి, సల్మాన్,సల్ల సాయి,ఇందూరి సాయి, ఆశు,కెవిన్,కుశాల్,నల్ల నీక్షిత్,చరణ్, నితిన్,డింపురోహిత్,మహానామా,బీ ఆర్ ఎస్ వి పట్టణం ప్రెసిడెంట్ ఆడెపు అరుణ్ ప్రసాద్,బీ ఆర్ ఎస్ వై జనరల్ సెక్రటరీ సుమంత్,నితిన్,రోహిత్,తదితరులు పాల్గొన్నారు…