కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులపై నిల్వక్షం చేస్తే సహించేది లేదు…

కామారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులపై నిల్వక్షం చేస్తే సహించేది లేదు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి వ్యూవర్స్ )

కామారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య., ఇందిరమ్మ ఇల్లు., భూభారతి,. తాగు సాగునీరు . ఎరువులు విత్తనాలు , వ్యవసాయం., శిశు మహిళా సంక్షేమం, పరిశుభ్రత పచ్చదనం (వన మహోత్సవం) ఇతర అభివృద్ధి పనులపై అధికారులు నిర్లక్ష్యం చేస్తే సాయం చేయలేదని కామారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు.

 

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో మంగళవారం రివ్యూ నిర్వహించిన ఇన్చార్జి మంత్రి డి.అనసూయ ( సీతక్క) , ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్లతో కలిసి అధికారుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ. జిల్లాలో పలు అభివృద్ధి పనులపై అధికారులు ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. పలు సంబంధిత శాఖల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని అన్నారు. ప్రజా సమస్యలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన పనులతో పాటు రాజాలకు సహకరించాలని అన్నారు. అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధిపై దృశ్య సారించాలని అన్నారు. ఉమ్మడి జిల్లాల అభివృద్ధి ధ్యేయంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా బాధ్యతలకు ఎలాంటి భంగం కాకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి , మదన్ మోహన్ రావు, లక్ష్మీ కాంతారావు. స్త్రీ&శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనిత రామచంద్రం, పంచాయత్ రాజ్ ఈ ఎన్ సి కనకరత్నం,జిల్లా కలెక్టర్, ఎస్పీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!