మొక్కలు నాటి రాబోయే తరానికి మహావృక్షాలుగా అందించాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్)
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి రాబోయే భావితరాలకు మహావృక్షాలుగా అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ
స్కూల్(బాలికలు) రెసిడెన్షియల్లో వనమహోత్సవం కార్యక్రమం ద్వారా జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలతో కలిసి మొక్కలు నాటిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ , జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క లు మొక్కలు నాటారు పరిశుభ్రంగా ఉంచుకొని పచ్చదనం పరిశుభ్రతతో గ్రామాలు, పట్టణాలలో మొక్కలు నాటే వనమోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రజేష్ చంద్ర, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రజా ప్రతినిధులు తదితరులు.