42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్)
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ జన సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కుంభరా లక్ష్మణ్ యాదవ్ మంగళవారం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఎన్నికల ముందు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ డిక్లేషన్ పేరుతో పారి బహిరంగ సభ నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీని ఇచ్చింది ఇప్పుడు ఆ హామీని నిలబెట్టు కోడంపై హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాతెలంగాణ జన సమితి తరపున ముఖ్యమంత్రికి మహమ్మద్ షబ్బీర్ అలికి, కోదండరాం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదేస్పూర్తితోటి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయుట కొరకు రాష్ట్రంలోని వివిధ సామాజిక శక్తులు తెలంగాణ జన సమితి చేసిన పోరాటాలు ప్రయత్నాల మూలంగా నేడు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే ఆర్డినెన్స్ సాధించుకోగలిగామని ఇది ప్రజా విజయమని తెలంగాణ జన సమితి అభిప్రాయపదింది. తెలంగాణ సాధించుకుంటే రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అడుగులు పడతాయని జయశంకర్ నాడు తాను ముచ్చట్లో చెప్పినట్టుగానే ఈరోజు అడవుల దిశ మొదలైందని మేం భావిస్తున్నట్లు తెలిపారు. గత పది ఏళ్ల కాలంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించి టిఆర్ఎస్ సామాజిక న్యాయానికి తూట్లు పొడిచింది అని 32 శాతం రిజర్వేషన్లు 18 శాతానికి తగ్గించి బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేసింది. ఈ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సాహసో పేతమైనది అన్నారు. ఈ సాహసోపేత నిర్ణయాన్ని తెలంగాణ జన సమితి అభినందిస్తుందనీ అన్నారు. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా అమలులోకి తీసుకురావాలని తెలంగాణ జన సమితి కోరుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జడల రజనీకాంత్ ,జిల్లా ఉపాధ్యక్షులు ఫుల్ సింగ్, పట్టణ నాయకుడు రాజు తదితరులు పాల్గొన్నారు.