స్వచ్ఛందంగా శిక్షణ ఇచ్చిన సోనియాశంకర్ ఫౌండేషన్ అభినందించిన కలెక్టర్..-

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వయం ఉపాధి కోసం 60 మందికి కుట్టు మిషన్ల శిక్షణ మెచ్చిన సోనియా శంకర్ ఫౌండేషన్ నిర్వాహకులను జిల్లా కలెక్టర్ అభినందించారు. సోమవారం సాయంత్రం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సోనియా శంకర్ ఫౌండేషన్ వారు కలసి బేటీ బచావో బేటీ పడవో పథకము లో భాగంగా కుట్టు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శిక్షణ పొందిన 60 మంది మహిళలకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సర్టిఫికెట్ ప్రధానం చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళాలు సాదికరత సాధించాలి అంటే ఆర్థికంగా వారు వారి కాళ్లపై నిలబడే విధంగా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలని, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఏ ప్రమీల, సోనియా శంకర ఫౌండేషన్ చైర్మన్ శంకర్ బొలెరావు, వైస్ చైర్మన్, శిక్షణ నిచ్చిన సోనియాశంకర్, జిల్లాలోని సిడిపిఓలు సూపర్వైజర్ జిల్లా మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది మొదలగువారు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


