కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…

కామారెడ్డి లో ఇందిర మహిళా శక్తి సంబరాలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 15 (అఖండ భూమి న్యూస్);

కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ లు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది అన్నారు.

సంబరాల్లో భాగంగా అక్షర లక్ష్మి కార్యక్రమం ద్వారా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకూ కనీస విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

అదనంగా, మహిళా సంఘాల్లో భాగముకాని కొత్త మహిళలను చేర్చి, కొత్త సంఘాలను ఏర్పాటు

చేయాలనీ అధికారులను ఆదేశించారు.

 

ప్రతి సంఘ సభ్యురాలికి జీవిత భీమా తప్పనిసరిగా ఉండాలని సూచించడంతో పాటు, తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే మహిళలకు రూ1లక్షల రుణ సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.

మహిళలను కోటీశ్వరులని చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.

ప్రభుత్వం నుండి మహిళలకు

మహిళా సమైక్య ద్వారా పెట్రోల్ బంకులు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యతను ఐకేపీ మహిళా సంఘాలకే అప్పగించడం ద్వారా స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థలకు అవసరమైన యూనిఫాంలను కుట్టే పనులను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో

స్త్రీ శిశు సంక్షేమానికి 2862 కోట్లు

కేటాయించి మహిళలకు పెద్దపీట వేశారు అన్నారు.

వారిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పలు పథకాలను ప్రతిపాదించిన రేవంత్ సర్కారు. గ్రామీణ మహిళాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి పథకం మహిళకు ఒక వరం లాంటిది అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!