చెత్త నుండి సంపద వృద్ధి… 

చెత్త నుండి సంపద వృద్ధి…

కర్నూలు డివిజనల్ అభివృద్ధి అధికారి…

వెల్దుర్తి జులై 15 (అఖండ భూమి) : మేజర్ గ్రామపంచాయతీ అయినటువంటి వెల్దుర్తి పట్టణం నందు మంగళవారం కర్నూలు డివిజనల్ అధికారి రమణారెడ్డి చెత్త నుండి సంపద వృద్ధిని పంచాయతీ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐ వి ఆర్ ఎస్ ఫోన్ కాల్స్ లో భాగంగా15 వార్డులలో మంగళవారం ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా డివిజనల్ అభివృద్ధి అధికారి కర్నూలు రమణ రెడ్డి వెల్దుర్తి 13 వార్డులో సందర్శించి గ్రామం లోని ప్రజలతో మాట్లాడారు, ప్రతి ఒక్కరు చెత్తను ఎక్కడపడితే అక్కడ వెయ్యకుండా రిక్షాలు మరియు ట్రాక్టర్ లో వెయ్యాలి అని సూచించారు, ఆ తర్వాత నక్కల తిప్ప దగ్గర ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు వర్మ కంపోస్ట్ తయారీ మరియు విక్రయాల గురించి అడిగారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రవి కిషోర్ సార్ మరియు పంచాయతీ కార్యదర్శి కె లక్ష్మీనాథ్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!