కామారెడ్డి జిల్లాలో ఆర్టీఏ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు..!
ఏసీబీ తనిఖీలు అవుతుండగా లారీ డ్రైవర్ లు వచ్చి మామూల్లు.
జిల్లాలో ఏసీబీ తనిఖీలతో కలకలం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూలై 16 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలోని ఆర్టిఏ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ఏసీబీ అధికారులు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న ఆర్టిఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించారు. ఒకవైపు ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతుండగా లారీలు ఆపి డ్రైవర్ లు చెక్పోస్ట్ వద్దకు వచ్చి యధావిధిగా మామూలు ఇవ్వడం ఏసీబీ అధికారుల కంటపడ్డాయి. ఒక వాహనానికి 500 చొప్పున మామూలుగా ఏసీబీ అధికారులు నివ్వెర పోయేలా చేశాయి. ఒకవైపు ఏసీబీ దాడులు కొనసాగుతున్న విషయం దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లకు తెలియక మామూలు ఇచ్చే వారు వాహనాలను ఆపి వాహనానికి 500 చొప్పున ఇవ్వడం చూస్తుంటే ప్రతిరోజు జంగంపల్లి ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ఏ స్థాయిలో మామూలు వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కామారెడ్డి జిల్లా తో పాటు నల్గొండతో పాటు పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



