శ్రీశైలం దేవస్థానం దర్శనార్థం వచ్చే భక్తులు బ్రోకర్లు నమ్మి మోసపోవద్దని టూ టౌన్ హెచ్చరిక హెచ్చరిక
శ్రీశైలంఅఖండ భూమి న్యూస్16, జూలై
శ్రీశైలం కు చెందిన పవన్ అనే వ్యక్తి హైద్రాబాద్ కు చెందిన 3 ఫ్యామిలీస్ వద్ద గర్భాలయ అభిషేకం చేపిస్తానని ఒక్కొక్క ఫ్యామిలీ వద్ద రూ.5000 చొప్పున మొత్తం 15000 వేల రూపాయలు డబ్బు వసూలు చేసి గర్భాలయ అభిషేకం చేపించకుండా మోసం చేసాడని భక్తులు శ్రీశైలం దేవస్థానం అధికారుకు ఫిర్యాదు చేయగా సదరు మోసం గురించి శ్రీశైల దేవస్థానం CSO శ్రీశైలం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా భక్తులను మోసం చేసి 15000 రూ డబ్బులు తీసుకున్న పవన్ పైన చీటింగ్ కేసు నమోదు చేయబడింది భక్తులకు ముఖ్య గమనిక దర్శనం కోసం శ్రీశైలం అధికారికి వెబ్సైట్ నందు మరియు రూములు కోసం నేరుగా CRO ఆఫీసును సంప్రదించాలి. దర్శనం కోసం గాని రూములు కోసం గాని దళారులను నమ్మి మోసపోవద్దని పోలీసువారి సూచన. ఇదేవిధంగా భక్తులను ఎవరైనా మోసం చేస్తే వారిపైన కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి.