బోరు మోటర్ ను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు పల్లె రమేష్ గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 17 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా, పల్వంచ మండలంలోని ఫరీద్ పేట్ గ్రామం 4వ , 5వ వార్డులలోసుదీర్ఘకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యను గుర్తించి పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ సత్వరమే బోరు మోటర్ ను వేయించారు. సమర్థవంతమైన పరిష్కారం లభించింది. ఈ సమస్యను గుర్తించిన వెంటనే, పల్వంచ మండల కాంగ్రెస్ అత్యంత చొరవ చూపి, తాగునీటి సరఫరాకు అవసరమైన బోరు మోటార్ , స్టార్టర్ ఏర్పాటు చేయించడం జరిగింది. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, నిరంతరాయమైన తాగునీటి సరఫరా సాధ్యమైంది. ఆయనకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ కార్యకర్తలు, 5వ వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, ఉత్సాహంగా పాల్గొన్నారు. నాయకత్వంలో ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయినంద
గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్య గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధతను, సేవాభావాన్ని ప్రతిబింబిస్తుంది.పల్లె రమేష్ గౌడ్ మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను సొంత సమస్యలుగా భావించి, వాటిని వెంటనే పరిష్కరించడం మా బాధ్యత. ఫరీద్ పేట్ గ్రామంలో తాగునీటి సమస్యను తీర్చడం ద్వారా ప్రజలకు మేలు జరుగతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.