నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తూన్న ఎస్ పి ఆర్ పాటశాల పై చర్యలు తీసుకోవాలి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 17 (అఖండ భూమి న్యూస్);
అడ్మిషన్ పేరుతో వసూలు చేసిన ఫిజులను వెనక్కి ఇవ్వాలని పాఠశాల ఆవరణలో ప్లకార్డులుతో గురువారం నిరసన చేశారు.
నూతన గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసిన తరువాతనే ఫీజులు వసూలు చేయాలనీ డిమాండ్ చేశారు.
పాఠశాల కార్యాలయంలో డిమాండ్ నోటీస్ అతికించి నిరసన తెలిపారు తెలిపారు.
ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్ , బిబిఎం రాష్ట్ర కార్యదర్శి డీటెయిల్స్, ఎస్ఎఫ్ఐ అరుణ్ కుమార్ , యశ్వంత్, బుల్లెట్ స్టాలిన్ , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎస్ పి ఆర్ పాఠశాల నిబంధన విరుద్ధంగా పాఠశాలలో అడ్మిషన్ పేరుతో 5000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అడ్మిషన్ ఫీజును వసూలు చేయొద్దని చెప్పిన ఏకపక్ష నిర్ణయంతో ఇష్టానుసారంగా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు..విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ప్లకాడ్స్ అంటించడం జరిగింది. అనంతరం పాఠశాల యాజమాన్యంకు డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగింది అన్నారు. గవర్నింగ్ బాడీలో యాజమాన్యం తమ కుటుంబ సభ్యుల పేరుతో అనుచరులతో కమిటీని ఏర్పాటు చేసి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేసుకునేలా నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీ విద్య హక్కు చట్టానికి విరుద్ధంగా ఉందని కమిటీని వెంటనే రద్దుచేసి ఓపెన్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసి తల్లిదండ్రులను, విద్యావంతులను ,ప్రభుత్వ అధికారులతో కలిసి ఫీజులను నిర్ణయించాలన్నారు. ఆ ఫీజులను మాత్రమే వసూలు చేయాలన్నారు. దిశా ప్రోగ్రాం పేరుతో అదనంగా 15000 నుంచి 20వేల వరకు వసూలు చేస్తున్నారన్నారు.అలాగే అడ్మిషన్ పేరుతో వసూలు చేసిన డబ్బులను వెంటనే వాపాస్ ఇవ్వాలి అన్నారు.పుస్తకాల పేరుతో వ్యాపారం చేయడం సరికాదని 30% విద్యార్థులకు డిస్కౌంట్ ఇవ్వాలని అన్నారు. వెంటనే జిల్లా విద్య శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మేము చెప్పిన డిమాండ్ లను అమలు చేయకపోతే భౌతిక దాడుల సైతం వెనకాడమని దానికి పూర్తి బాధ్యత పాఠశాల యజమాన్యజమని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఐరెని సందీప్ కుమార్, బివిఎం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్,యశ్వంత్,బులెట్, స్టాలిన్,అందుకుల అనిల్,శ్యామ్ టీంకు, సూఫీయాన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.