అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి అఖండ భూమి అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని మారుమూల ప్రాంతాలలో గంజాయి పండించే రైతులను ప్రత్నామాయ పంటలవైపు మళ్ళించే విధంగా చర్యలు తీసుకోవాలని గూడెం కొత్త వీధి మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు మండల సిబ్బందిని కోరారు మండలంలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులతో ఆయన మాట్లాడుతూ గూడెం కొత్త వీధి మండలంలోని గంజాయి పండించే రైతుల వివరాలను సేకరించి వారిని ప్రత్యామాయ పంటలు పండించుకునే విధంగా చర్యలు చేపట్టాలని మండల స్థాయి అధికారులు సిబ్బంది పూర్తిస్థాయిలో ఈ విషయంపై దృష్టి సారించి ఆయా ప్రాంతాలలో రైతులు ఏ ఏ పంటలు పండించడానికి ముందుకు వస్తున్నారు వాటి సమాచారాన్ని సేకరించి వారికి విత్తనాలను సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలని ఆయన కోరారు అలాగే మండలంలోని జగనన్న హౌసింగ్ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయడానికి హౌసింగ్ అధికారులతో పాటు ఇతర శాఖల సిబ్బంది కూడా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కోరారు మండలంలోని మారుమూల ప్రాంతాల వ్యవసాయ రైతుల ప్రచనామాయ పంటల పైన హౌసింగ్ పైన పూర్తిస్థాయిలో మండల స్థాయి అధికారులు అందరూ దృష్టి పెట్టి సమిష్టి కృషితో కార్యక్రమాలు ముందుకు తీసుకు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీడీవో ఉమామహేశ్వరరావు కోరారు ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం ఏపీఓ రాంప్రసాద్ మండల వ్యవసాయ అధికారి మధుసూదన్ రావు హౌసింగ్ ఇంచార్జ్ ఏఈ వినయ్ తోపాటు వివిధ శాఖల అధికారులు గ్రామపంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు

