
ఆటోలు గ్రామానికి వెళ్ళిన ఎమ్మెల్యే.
అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి, అఖండ భూమి,మే 8:- అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధీ మండలం లకవరపు పేట పంచాయతీ సురవరం గ్రామానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాడేరు ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి సందర్శించారు. ప్రధాన రహదారి నుండి సురవరం వెళ్లే రోడ్డు అస్తవ్యస్తంగా బురదమయం కావటంతో ఎమ్మెల్యే యొక్క వాహనం గ్రామానికి వెళ్లలేకపోవటంతో సురవరం మొదటి వీధి నుండి ఎమ్మెల్యే ఆటోలో సురవరం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో ఉప సర్పంచ్ గంగాధర్,సురవరం మహిళలు తమ యొక్క రోడ్డు కష్టాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవటంతో రోడ్డు నిర్మాణం జరగటంలేదని స్వయంగా మీరు మా రోడ్డు స్థితిని చూశారు కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ కొరకు సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే స్వయంగా రోడ్డు యొక్క స్థితిని చూశాను కాబట్టి ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి ఫారెస్ట్ క్లియరెన్స్ కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


