కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ కమలం కైవసం చేసుకోవాలి…

కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ కమలం కైవసం చేసుకోవాలి…

ఇద్దరు ముఖ్యమంత్రుల అభ్యర్థులను ఓడించి రమణారెడ్డిని ఎమ్మెల్యే గా గెలిపించిన చరిత్ర కామారెడ్డి ప్రజలది..!

ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ సిద్ధం..

కార్యకర్తల ఎన్నికలు జరుగుతున్నందున పోటీ చేయని నాయకులు ముందుండి గెలిపించాలి..

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన *స్థానిక ఎన్నికలపై కార్యశాల* నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, కామారెడ్డి జిల్లా ఎన్నికల ప్రభారి ఆకుల విజయ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పార్టీ గెలుపుకు కృషి చేయాలని, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ కమలం కైవసం చేసుకోవాలనీ అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి రమణారెడ్డి గారిని MLA గా గెలిపించిన చరిత్ర కామారెడ్డి ప్రజలది అని గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ పోటీకి సిద్ధంగా ఉందని అన్నారు. కార్యకర్తల ఎన్నికలు జరుగుతున్నందున పోటీ చేయని నాయకులు, కార్యకర్తలు ముందుండి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!