ఆర్.ఆర్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 19 (అఖండ భూమి న్యూస్);
పాల్వంచ మండల కేంద్రంలోని ఆర్.ఆర్ పాఠశాలలో శనివారం రోజున బోనాల పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు.
ఆర్.ఆర్ పాఠశాలలో బోనాల పండుగను (బోనాలు ఫెస్టివల్ ) ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ టి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ. బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగ అన్నారు. ఈ పండుగను హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో , రాష్ట్రంలోని ప్రాంతాలలో పండుగను ఘనంగా జరుపుకుంటారన్నారు.
బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్లోనే తయారుచేసిన నైవేద్యాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపుగా దేవాలయాలకు వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. విద్యార్థులు పోతరాజుల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రామ్ రెడ్డి సునీల్ రెడ్డి,రామచంద్రం, రాణి మానస,మౌనిక, విజయరాణి, రేఖ విద్యార్థి,విద్యార్థులు పాల్గొన్నారు.