రక్తదానం చేసేవారికి క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువ.
– తలసేమియా చిన్నారికి రక్తదానం.
– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జులై 19. (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి రవీన్ (7) కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ఐవిఎఫ్ సేవాదళ్ నిజామాబాద్ జిల్లా చైర్మన్ సాయి కృష్ణ సహకారంతో తెలంగాణ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న బట్టు తిరుపతి రక్త దానం చేసి చిన్నారి ప్రాణాలను కాపాడడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానం చేసే వారికి క్యాన్సర్ మరియు గుండె పోటు, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని,రక్తదానం చేసే వారికి కొత్త రక్త కణాలు ఉత్పత్తి కావడం జరుగుతుందని అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం జరిగిందని కావున ప్రతి ఒక్కరూ సంవత్సరానికి మూడుసార్లు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఒకప్పుడు రక్తదానం చేయడం అంటే తోటి వారి ప్రాణాలను కాపాడడం మాత్రమే అని నేటి పరిస్థితుల్లో రక్తదానం చేయడం అంటే మన ప్రాణాలను కాపాడుకోవడమే నే భావనను సమాజంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత బట్టు తిరుపతికి అభినందనలు తెలియజేశారు.