ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి సురేష్ ఆత్మహత్య..*?

ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి సురేష్ ఆత్మహత్య..*?

-గోడదూకి నర్సరీలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య..

-పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘాలు బిజెపి నాయకులు..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ జులై 19:(అఖండ భూమి న్యూస్)

ఆర్మూర్ పట్టణ శివారు పిప్పిరి రోడ్డులో కొనసాగుతున్న వేల్పూర్ ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గడ్డం సంతోష్ శనివారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విద్యార్థుల్లో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంతోష్ (17) సెలవులు ముగించుకుని ఈ నెల 9వ తేదీన బైపిసి ఇంటర్ రెండవ సంవత్సరంలో చేరాడు. ఉదయం తోటి విద్యార్థులతో కలిసి మార్నింగ్ వాక్, పలు వ్యాయామాలు చేశాడు. తదుపరి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఒంటరిగా వెళ్లి కళాశాల ప్రాంగణం గోడ దూకి బయట మున్సిపల్ కు చెందిన నర్సరీలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్య ఘటనతో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ గౌడ్, ఎస్సై లు రమేష్ సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉదయం పూటనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినందున చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థి మృతదేహాన్ని జడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.

 

*ఆత్మహత్యకు కారకులు ఎవరు..*?

 

ఆర్మూర్ లోని వేల్పూర్ కు చెందిన ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంతోష్ మృతికి కారణాలు ఏమై ఉంటాయని పోలీసులతోపాటు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురుకుల కళాశాలలో ఈ మధ్య ఎలాంటి వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకోలేదని తోటి విద్యార్థులు చెప్పారు. అందరూ కలిసిమెలిసి ఒకే గదిలో ఉంటున్నట్లు తోటి విద్యార్థులు చెప్పారు. సంతోష్ పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివి, ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియంను తీసుకున్నాడు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో మూడు సబ్జెక్టులు తప్పాయని అధ్యాపకులు చెప్పారు. సబ్జెక్టులు తప్పడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు వచ్చి రెండు నెలల తర్వాత ఇప్పుడే ఎందుకు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ అంశాలే కాకుండా విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమి ఉంటాయనే కోణంలో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. గురుకుల క్యాంపస్ పక్కనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఏం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు, బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!