బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి
ఎంపిడిఓ బండారు శ్రీనివాసులు
యర్రగొండపాలెం అఖండ భూమి:
బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి. వారి భవిష్యత్తు మెరుగ్గా ఉండాలంటే విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎంపిడిఓ బండారు శ్రీనివాసులు, తహశిల్దార్ డి మంజునాథరెడ్డి, ఎంఈఓ పి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం యర్రగొండపాలెం పట్టణంలో సార్ట్స్ బాల ప్రకాశం ఆధ్వర్యంలో బడిబాట ఆటో ర్యాలీని ప్రారంభించి వారు మాట్లాడారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకే కాదు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.తల్లికి వందనం పధకం ద్వారా ఇంట్లోని ప్రతి విద్యార్థి చదువుకు రూ.15 వేలు ఆర్ధిక సహాయం, ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య పరిరక్షణ సేవలు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్లు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రోత్సాహకాలు, బాలికల భద్రత, విద్య కోసం దిశ. కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు. కొన్ని పాఠశాలల్లో ఉచిత డిజిటల్ ఉపకరణాలు, ట్యాబ్ లు, స్మార్ట్ టీవీలు, శాంతియుత, ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం. అర్హత కలిగిన, శిక్షణ పొందిన ఉపాధ్యాయుల బోధన, విద్యతో పాటు నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం. సామాజిక చైతన్యం బోధించే ఉపాధ్యాయులు ఇలా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. చదువు అనేది పిల్లల హక్కు మాత్రమే కాదు, వారి భవిష్యత్తును నిర్దేశించే మార్గం కూడా అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బాల ప్రకాశం ప్రాజెక్టు మేనేజర్ మహాలక్ష్మి, ప్రతినిధులు డేవిడ్ జోషి,ఏఎస్ఓ నాగేంద్ర, ఏఎన్ఎం అంజమ్మ, సిఎఫ్ సి టీం చిన్నమ్మి, ధర్మా నాయక్, దేవయ్య, హనుమంతరావు నాయక్, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..