కూల్ డ్రింక్ షాప్ లో నకిలీ మద్యం స్వాధీనం..వ్యక్తి అరెస్ట్
యర్రగొండపాలెం అఖండ భూమి:
యర్రగొండపాలెం మండలంలోని చెన్నరాయునిపల్లి గ్రామంలో గల ఒక కూల్ డ్రింక్ షాప్ లో నకిలీ మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతనితో పాటు 11 బ్రాందీ బాటిళ్లను స్వాదీనం చేసుకున్నట్లు యర్రగొండపాలెం ఎక్సైజ్ సిఐ సిహెచ్ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యర్రగొండపాలెం ఎక్సైజ్ స్టేషన్ సిబ్బందితో పాటు మార్కాపురం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది. కూడా చెన్నరాయునిపల్లిలో సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఆ గ్రామానికి చెందిన మండ్ల బాలయోగి తన కూల్ డ్రింక్ షాప్ లో నిషేధిత మద్యాన్ని నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. అందుచేత ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 34(ఎ) ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదకర మధ్యం, విక్రయాలను అడ్డుకోవడంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఈ దాడులు ముమ్మరంగా చేసినట్టు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అక్రమ రవాణా, నిల్వ విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. పౌరుల భద్రత కోణంలో ప్రభుత్వం మద్యంపై నియంత్రణ విధానాలను కఠినంగా అమలు చేస్తోందని, అలాంటి ఆక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..