కామారెడ్డి జిల్లా నూతన ఏఐకేఎంఎస్ కమిటీ ఎన్నిక…

అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏ ఐ కె ఎమ్ ఎస్) కామారెడ్డి జిల్లా నూతన ఏఐకేఎంఎస్ కమిటీ ఎన్నిక…

*కామారెడ్డి పట్టణంలోని అఖిల భారత రైతు కూలీ ఏఐకేఎంఎస్ సంఘం జిల్లా నాయకులు నరసయ్య అధ్యక్షతన సమావేశం ఆదివారం జరిగింది.

 

*ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు దేశెట్టి సాయి రెడ్డి , మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగం పట్ల చిన్న చూపు చూస్తుందని రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఎమ్మెస్పీ మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంటులో అమలు చేయాలని నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని విరమించుకోవాలని సాయి రెడ్డి అన్నారు.

 

*రైతాంగ ఉద్యమ ఫలితంగా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చిన హామీని మోదీ ఈరోజు వరకు నెరవేర్చలేదు అని ఆరోపించారు.

 

*మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 14 నెలలపాటు రైతాంగం పోరాటం చేశారు. ఈ పోరాటంలో సుమారు 800 వందల మంది రైతులు తమ ప్రాణాల అర్పించినారు అని అన్నారు.

 

*ఆపరేషన్ కగారు పేరా మావోయిస్టులను అమాయక గిరిజన ఆదివాసీలను బూటకపు ఎన్కౌంటర్ల పేరా వందలాది మందిని చంపుతున్నారు అని ఆరోపించారు.

 

*ఆదివాసులను అడవుల నుండి బలవంతంగా వెళ్లగొట్టడం అడవుల్లో ఉన్న 89 రకాల ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ఆదాని అంబానీలకు అంట కట్టడానికి నరేంద్ర మోడీ,అమీషా ఖనిజ సంపదను అప్పజెప్పాలని చూస్తున్నారు. కావున నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉన్నదని సాయి రెడ్డి అన్నారు.

 

అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ కామారెడ్డి జిల్లా కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు సూర నరసయ్య, ఉపాధ్యక్షులు ఎస్కే నయీముద్దీన్, సహాయ కార్యదర్శి, పి. కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి చిన్న అలీ , కోశాధికారి సిహెచ్. సుజాత, కార్యవర్గ సభ్యులుగా ఏడుగురిని ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన కమిటీని రాష్ట్ర నాయకులు సాయి రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!