కల్తీకల్లు పేరిట ఎక్సైజ్ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలి…
…. జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 20 (అఖండ భూమి న్యూస్);
కల్తీకల్లు విక్రయిస్తున్నారని గౌడ కులస్తులపై ఎక్సైజ్ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.మద్యం మాఫియా కు తలోగ్గి కులవృత్తిని నిర్వీర్యం చేయవద్దన్నారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవడానికి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఐదు ఎకరాల స్థలం,డ్రిప్ సౌకర్యం కల్పించి ఈత చెట్లను పెంచే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్,నాయకులు ఇందూరి సిద్ధ గౌడ్, కర్రోల్ల శేఖర్ గౌడ్ , బొంబోతుల సురేష్ గౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్,బాలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



