నీటి ఎద్దడి లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోరు మోటర్ వేయించిన పల్లె రమేష్ గౌడ్…
ఫరీద్ పేట్ గ్రామంలో తాగునీటి సమస్యకు వేగవంతమైన పరిష్కారం – పల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ చొరవ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 21 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా, పల్వంచ మండలంలోని ఫరీద్ పేట్ గ్రామం 12 వ వార్డులోసుదీర్ఘకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యకు సత్వరమైన, సమర్థవంతమైన పరిష్కారం లభించింది. ఈ సమస్యను గుర్తించిన వెంటనే, పల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ అత్యంత చొరవ చూపి, తాగునీటి సరఫరాకు అవసరమైన బోరు మోటార్ ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన, నిరంతరాయమైన తాగునీటి సరఫరా సాధ్యమైంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, 12 వ వార్డు ప్రజలు, స్థానిక నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పల్లె రమేష్ గౌడ్ నాయకత్వంలో ఈ మంచి పని విజయవంతంగా పూర్తయినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…