సీజనల్ వ్యాధులపై అప్రమత్తత,

*వర్షాలు, వానాకాలం పంటల సాగు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తత, రేషన్ కార్డుల పంపిణీ పురోగతి అంశాలపై చర్చ*

మెదక్ జిల్లా ప్రతినిధి

అఖండ భూమి న్యూస్ జూలై 21

హైదరాబాదు నుండి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్.

హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లిభట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ,దనసరి అనసూయ సితక్క,

వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు

మెదక్ కలెక్టరేట్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదనవు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ డిఎం సివిల్ సప్లై నిత్యానంద్ ఈ ఇరిగేషన్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ఇతర జిల్లా అధికారులతో కలసి కలెక్టర్ పాల్గొన్నారు.

వీడియో సమావేశం అనంతరం *కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులతో రివ్యూ చేస్తూ…. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను తూ చ తప్పకుండ జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు పాటించాలన్నారు

జిల్లా లో ఉన్న ఫర్టిలైజర్ షాప్ లకు రెవిన్యూ, పోలీస్ అధికారులను నియమించే విధంగా వివరాలు ఇవ్వాలిసిందిగా వ్యవసాయ అధికారికి తెలిపారు

రేషన్ కార్డు లు ఇంకా ఎన్ని పంపిణి చేయాలిసి ఉన్న వివరాలను ఇవ్వాలని సివిల్ సప్ప్లై అధికారులకు తెలిపారు

ఇరిగేషన్ కి సంబందించి చెరువుల నీటి నిల్వల వివరాలను రోజువారీగా సమర్పించాలన్నారు

ఇరిగేషన్ అధికారుల అధిక వర్షాలు వరదల వల్ల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని

అధిక వర్షాలు వరదల వల్ల చెరువులలో నిండి కట్టలు తెగే ప్రమాదం ఉండవచ్చునని ముందే గుర్తించి తద్వారా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజారోగ్య పరిరక్షణ ధ్యేయంగా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయి పర్యటనలు చేసి

ఫీవర్ సర్వే సమర్ధవంతంగా నిర్వహించాలని డయాగ్నస్టిక్ హబ్ నుండి రిపోర్టులు త్వరితన తెప్పించుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలని

ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యాధికారులకు వివరించారు.

మున్సిపాలిటీలో శానిటేషన్ ఫాగింగ్ విషయంలో కలెక్టర్ తగు సూచనలు చేస్తూ మున్సిపాలిటీలో ఫాగింగ్ మిషన్లు వివరాలు ఫాగింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని, తెలిపారు.

వర్షాలకు సంబందించి

ఆర్డీ వో, తహసీల్దార్ లు అప్రమత్తం గా ఉండి… రోడ్ డ్యామేజ్ జరగకుండా…

కాలువలు తెగకుండా…వరదల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!