బనచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం

బనచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం

టీఆర్ఎస్వి (బీఆర్ఎస్వి) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్

బెల్లంపల్లి జులై 22(అఖండ భూమి న్యూస్):సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్ వలన తెలంగాణకు జరిగే అన్యాయాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా విచ్చేసిన బీఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బడికల శ్రావణ్ గారు మాట్లాడుతూ*….పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఏపీ నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టే పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టు.పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుత్తు ఈనాడు తెలంగాణ రాష్ట్రము యొక్క నీళ్లను ఆంధ్రకు దోచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలకు చరమగీతం పాడాలని అన్నారు.అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడం దుర్మార్గం అన్నారు.ఇంత వరకు స్కాలర్షిప్లు ఇవ్వలేదు,విద్యార్థులకు ఇస్తామన్న ఐదు లక్షల విద్య భరోసా కార్డు ఇవ్వలేదు,విద్యార్థినిలకు స్కూటీలు ఇవ్వలేదు,అలాగే అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని తీవ్రమైన మోసం చేసినటువంటి మోసకారి రేవంత్ రెడ్డి అన్నారు.అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు పది పాస్ అయితే 10 వేలు, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15 వేలు, డిగ్రీ పాస్ అయితే 25 వేలు,పీజీ పాస్ అయితే లక్ష, ఏంఫీల్,పిహెచ్డి పూర్తిచేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తాను ఘోరంగా మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ అన్నారు.6 గారంటీలకు,420 హామీలకు తూట్లు పొడిచి ఈనాడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరియు బిజెపి ప్రభుత్వంతో అంటకాగుతూ పదవిని కాపాడుకుంటున్నటువంటి మోసకారి రేవంత్ రెడ్డి.తక్షణమే గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..లేని పక్షంలో భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ లక్షల మంది విద్యార్థులతో రేవంత్ ప్రభుత్వంను ముట్టడిస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు అడెపు అరుణ్,కార్యదర్శి బుద్ధర్తి సుమంత్,బీఆర్ఎస్వీ సీనియర్ నాయకులు మురుకురి శ్రావణ్,దార రోషన్,అజయ్,విష్ణు,సాయి కిరణ్,సంతోష్,బీఆర్ఎస్వి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!