గాంధారి మండలంలో విస్తృతంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్…

గాంధారి మండలంలో విస్తృతంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);

గాంధారి మండలంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గురువారం విస్తృతంగా పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ గారి తో పాటు ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి పాల్గొన్నారు.

1,

తిప్పారం వాగుపై గల లో లెవెల్ బ్రిడ్జిని అధికారులతో కలిసి పరిశీలించారు. గత సంవత్సరం అధిక వర్షాలు కురిసినప్పుడు లో లెవల్ బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహించి రాకపోకలకు ఇబ్బంది అయినా దృశ్య ఈసారి ముందు జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలపై అధికారులకు ఆదేశించారు.

వాగులో ఉన్న చెత్త చెదారం, బురదను తొలగించి వాగులో పైనుండి వచ్చే వర్షం నీరు కిందికి సాఫీగా వెళ్లేలా చూడాలని అన్నారు. అదేవిధంగా అధికంగా వర్షాలు కురిసినప్పుడు జిల్లాలో గుర్తించిన 38 ప్రాంతాలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 12 ప్రాంతాలు ఉన్నాయని వాటితో పాటు బ్రిడ్జిలు, రోడ్లపై నుండి వరద నీరు ప్రవహించే ప్రాంతాలను గుర్తించి ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసి వాగులకు ఇరువైపులా బారికేడింగ్ చేయాలని అన్నారు. రెవెన్యూ పంచాయతీ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ పోలీస్ శాఖ వారు బృందం ఏర్పాటు చేసుకొని కోఆర్డినేషన్తో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

2,

గాంధారి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారు ఆకుల బాలయ్య ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలోపరిశీలించారు.

పిల్లర్స్ స్థాయి వరకు నిర్మాణం పూర్తయినందున మిగతా నిర్మాణం కూడా వేగవంతం చేయాలని లబ్ధిదారుకు సూచించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఎక్కడ కూడా ఇసుక మరియు మొరం సమస్య లేదని ప్రభుత్వం సూచించిన విధంగా నాణ్యతగా ఇండ్లను నిర్మించుకొని త్వరగా గృహప్రవేశాలు చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను ప్రారంభించడానికి డబ్బులు ఇబ్బందిగా ఉన్న నిరుపేద లబ్ధిదారులకు ఐకెపి ద్వారా ముందస్తు రుణం అందించాలని లబ్ధిదారులు ఐకెపి గ్రూపులో లేకపోతే గ్రూపులో చేర్చి మరీ రుణాలను అందించాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి మరియు ఏఈ హౌసింగ్ స్వర్ణలతను ఆదేశించారు

3,

గాంధారి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ రిజిస్టర్ ను, ఆసుపత్రిలో పారిశుద్ధ్యం తీరును పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు.

ఈ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు చేస్తున్నందుకు వైద్యాధికారులను అభినందించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి గైనకాలజిస్ట్ డాక్టర్ ను నియమించినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇది వ్యాధులు అధికంగా వ్యాపించే సమయమని సాధారణంతో పోలిస్తే ఈ సమయంలో 20% అధికంగా రోగులు ఈ ఆస్పత్రికి వస్తున్నారు కాబట్టి వైద్యాధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సమయంలో జ్వరం వాంతులు విరేచనాలతో ఎక్కువమంది రోగులు వస్తారని అవసరమైన అన్ని మందులను ముందస్తు స్టాక్ పెట్టుకోవాలని అన్నారు. ఆస్పత్రి మరియు ఆస్పత్రి ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన వారికి రక్త మూత్ర పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలని అన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ ను ఆసుపత్రికి అనుసంధానించి శుద్ధమైన నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఏఈ ని ఆదేశించారు, ఆస్పత్రి ఆవరణలో గల పిచ్చి మొక్కలను చెత్త చెత్తారం తొలగించి శుభ్రపరచాలని జిల్లా పంచాయతీ అధికారి మురళిని ఆదేశించారు. టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా అదే విధంగా ఆసుపత్రి ఆవరణ చాలా విశాలంగా ఖాళీగా ఉన్నందున వెంటనే వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలను నాటి వాటి సంరక్షణ చేపట్టాలని ఎంపీడీవో రాజేశ్వర్ ను ఆదేశించారు.

 

గాంధారి సామాజిక ఆసుపత్రిలో వైద్యులు, మందులు అందుబాటులో ఉన్నాయని ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని వైద్య సేవలు పొందాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ విజయలక్ష్మి, వైద్యులు సంగీత్ కుమార్, ప్రసన్న, సుదీప్ తదితరులు ఉన్నారు.

4.

జిల్లా కలెక్టర్ గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి వనమహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటారు. కళాశాల ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటి గుంట నిర్మాణాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాల మరమ్మత్తులు, పెయింటింగ్, విద్యుత్ మరమ్మతు, త్రాగునీరు ఏర్పాటు కోసం 22 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని వెంటనే వాటితో పనులు ప్రారంభించి నాణ్యతగా పనులు పూర్తి చేయాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అధిక సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ పొందేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కళాశాలకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు రావడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం సరిగా లేదని విద్యార్థులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా విద్యార్థులు ఏయే గ్రామాల నుండి కాలేజీకి వస్తున్నారో వివరాలను అందించాలని కాలేజ్ ప్రిన్సిపాల్ గంగాధర్ ను ఆదేశించారు. టీఎస్ ఆర్టీసీ వారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారి షేక్ సలాం, డిఆర్డీఓ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

5.

జిల్లా కలెక్టర్ గాంధారి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టోర్ రూమ్ ను, మెనూ షార్టును పరిశీలించి ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని వేడివేడిగా వండి వడ్డించాలని విద్యాలయ ప్రత్యేక అధికారి శిల్పను ఆదేశించారు. వర్షాకాలం కాబట్టి విద్యాలయ ఆవరణలో చెత్తాచెదారం పిచ్చి మొక్కలు ఉంటే పాములు తేళ్లు వచ్చే విద్యార్థులకు హాని చేసే అవకాశం ఉంటది కాబట్టి పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయాలని అన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన ఉచిత విద్య భోజన వసతి ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు.

చివరిగా మండలంలో గల రెవెన్యూ మరియు ఫారెస్ట్ వివాదంలో ఉన్న భూములను రెవెన్యూ మరియు ఫారెస్ట్ అధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను సరిచూసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ రేణుక చౌహన్ ను ఆదేశించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!