సకల జీవుల మనుగడకు చెట్లే ఆధారం

సకల జీవుల మనుగడకు చెట్లే ఆధారం

స్ఫూర్తి సేవా సమితి. డోన్ నంద్యాల జిల్లా

అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఈ భూమ్మీద ఉండే సకల జీవుల మనుగడకు చెట్లే ఆధారమని, ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని డోన్ ప్రభుత్వ గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్యశిల్ప, రాష్ట్ర వాల్మీకి సంఘం డైరెక్టర్ వలసల రామకృష్ణ అన్నారు. స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో డోన్ లో గల మహాత్మ గాంధీ జ్యోతి రావ్ బాపూలే గురుకుల బాలికల స్కూల్ నందు గురువారం నాడు చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా హాజరై పాఠశాల సిబ్బంది, స్ఫూర్తి సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమనేది సామాజిక సేవల్లో ప్రధానమని కార్యక్రమం చేపట్టిన స్ఫూర్తి సభ్యులను, మొక్కలు అందించిన మెహతాజ్ షోరూం జహంగీర్ ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, స్ఫూర్తి సభ్యులు స్ఫూర్తి మధు, భాస్కర్, చంద్ర, మోహన్ రెడ్డి, జహంగీర్, టీచర్ రంగనాథ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!