కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ లను అందించిన కామారెడ్డి ఎమ్మెల్యే…

కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ లను అందించిన కామారెడ్డి ఎమ్మెల్యే…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి నియోజకవర్గం లోని ఆయా మండలాల్లో కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి గురువారం అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, భిక్కనూర్, మాచారెడ్డి, బిబిపేట్, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి మండలం అన్నారం, కామారెడ్డి, కామారెడ్డి రూరల్ మండలాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించి అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, ఆయా మండలాల బిజెపి నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!