ఆర్డినెన్స్ ఆమోదంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

ఆర్డినెన్స్ ఆమోదంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఆమోదంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈనెల 25 నాటికి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 25వ తేదీ తుది గడువు కావడంతో ఈరోజు చివరి రోజు ఉంది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని హెచ్ సి స్పష్టం చేసింది. గవర్నర్ ఆమోదం తెలపకపోతే, 25వ తేదీ జరగబోయే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తికరంగా మారింది. సుమారు రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పదవి కాలం పూర్తయిన ఎన్నో ఆశలతో గ్రామాల్లోని ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో ముందున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిస్థాయిలో షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో నాయకులు ప్రజలను కట్టడి చేయలేక తిరుత్సాహ పడుతున్నారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!