రాష్ట్రంలో బీసీలకు సరైన ప్రాధాన్యత లేదు

రాష్ట్రంలో బీసీలకు సరైన ప్రాధాన్యత లేదు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 24 (అఖండ భూమి న్యూస్);

రాష్ట్రంలో బీసీలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని బీసీ జర్నలిస్టుల జేఏసీ ప్రతినిధి చింతల నీలకంఠం అన్నారు. బుధవారం హైదరాబాద్ (సోమాజిగూడ) ప్రెస్ క్లబ్ లో బీసీ జర్నలిస్ట్ జేఏసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రతినిధి శ్రీనివాస్ చారి మాట్లాడుతూ ఐక్యమత్యంతో ఏదైనా సాధించవచ్చన్నారు. విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ ప్రతినిధి శీర్ల వంచ కృష్ణ మాచార్యులు మాట్లాడుతూ నాటి నుండి నేటివరకు బీసీలు అణిచివేతకు గురి అవుతూనే ఉన్నారన్నారు. ఇప్పటికైనా బీసీలు ఒక తాటిపైకి రావాలన్నారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా నుండి కుల సంఘాల జర్నలిస్టు ప్రతినిధులు బి ప్రవీణ్ గౌడ్, సునీల్, గోవర్ధన్, రాజేందర్ నాథ్తో వెళ్లగా ఆ కార్యక్రమంలో వీరితో పాటు 170 మంది బీసీ జర్నలిస్ట్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!