చిరుత పులిని పట్టుకోవడంలో ఫారెస్ట్ అధికారులు విఫలమయ్యారు…
లంబాడా పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సునావత్ గణేష్ నాయక్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);
చిరుత పులిని పట్టుకోవడంలో ఫారెస్ట్ అధికారులు విఫలమయ్యారని లంబాడా పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సునావత్ గణేష్ నాయక్ అన్నారు. గురువారం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. చిరుత పులి నీ పట్టుకోవడంలో పారిశ్రాధికారులు వైఫల్యం వలన చిరుత పులి రామారెడ్డి, రెడ్డి పెట్ గూగుల్ తండా, మాత రెడ్డి మండలంలో సంచరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడు ఆవులను చంపి చిరుత పులితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. అడవిలో గేదలు, మేకలు మేపడానికి కాపర్లు జంకుతున్నట్లు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోవడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఫారెస్టు డిపార్ట్మెంట్ పై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఫారెస్ట్ అధికారులు ఎందుకు సస్పెండ్ చేయడం లేదని లంబాడీల పోరాట సమితి డిమాండ్ చేశారు. రామారెడ్డి మండలంలో రెడ్డి పేట తండాలో నలుగురిని చిరుత పులిపై అనుమానంతో అరెస్టు చేశారని వారిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల పోడు భూముల సాగు చేస్తున్న చేస్తా ఉంటే అక్రమ కేసులు బనాయిస్తూ గిరిజనులను వేధిస్తున్నారని అన్నారు. అక్రమ అరెస్టులు ఆపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, వినోద్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్, బద్రి నాయక్, రవీందర్ నాయక్, ప్రకాష్ నాయక్, దేవి సింగ్ నాయక్, షేర్ సింగ్ నాయక్, శ్రీనివాస్ నాయక్జ్ తదితరులు పాల్గొన్నారు.