కేటీఆర్ సభను విజయవంతం చేయాలి.
మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ సదాశివ నగర్ జెడ్పిటిసి పడిగేలా రాజేశ్వరరావు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసే కేటీఆర్ సభను విజయవంతం చేయాలని బారాస నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ దేశాలను ఒప్పించి ఎన్నో కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించిన నాయకుడు కేటీఆర్ రాకకు అందరు స్వాగతించాలన్నారు. సదాశివనగర్ గాంధారి రామారెడ్డి మండలాల నుంచి సకాలంలో కామారెడ్డి చేరుకొని ర్యాలీగా లింగంపేట్ కు ర్యాలీలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సదాశివ నగర్ మాజీ జడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు, గాంధారి మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు వజీర్, శివాజీ రావు, రామారెడ్డి మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి , జిల్లా బీసీ నాయకుడు కళాలి సాయ గౌడ్ , మాజీ కాలభైరవ స్వామీ చైర్మన్ గంజి సతీష్ గుప్తా, జిల్లా గిరిజన నాయకులు లింబాద్రీ నాయక్ లు పాల్గొన్నారు.
మాజీ సదశివానగర్ జడ్పి టిసి పడిగేలా రాజేశ్వర్ రావు .