మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రయాణికులకు సూచన
మెదక్ జిల్లా జూలై 24 ప్రతినిధి (అఖండ భూమి న్యూస్) :
రన్నింగ్ లో ఉన్న బస్సులను ఎక్కడం లేదా దిగడం చేయవద్దని మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ ప్రయాణికులకు సూచించారు. బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే ప్రయాణికులకు సౌకర్య అర్థం బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళలో రద్దీ అధికంగా ఉంటుందని ఆ సమయంలో స్టూడెంట్స్ ఎంప్లాయిస్ ఉంటారని ఈ సమయంలో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రయాణికులు తమకు సహకరించాలని తెలిపారు.