శివుడిని తడిపిన దోమకొండ గ్రామస్తులు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);
శ్రావణ శుక్రవారం ప్రారంభం కావడంతో దోమకొండ గ్రామంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివలింగాలకు శుక్రవారం కుంభాభిషేకం చేశారు. దోమకొండ శివరాం మందిర్ ఆలయం నుండి మొదలుకొని స్థానిక కుడి చెరువులో నీటిని తీసుకొని దోమకొండ గడికోట లోని మహదేవుని ఆలయం శివలింగం, శివరాం మందిర్ ఆలయం శివలింగం లపై జలాభిషేకం చేశారు. డోలు, సన్నాయి వాయిద్యాల మధ్య భక్తులు భక్తిశ్రద్ధలతో పెద్ద సంఖ్యలో పాల్గొని జలాభిషేకంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దోమకొండ గ్రామ భక్తులు పాల్గొన్నారు.