నాణ్యమైన వైద్యం అందించాలి…

సీజనల్ వ్యాధులు బారిన పడిన రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);

జిల్లా కలెక్టర్ ఆశీస్సు సంఘ్వాన్ గారు రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్నటువంటి సేవల గురించి ఆరా తీశారు ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడి రామారెడ్డి ఆసుపత్రిలో ఉన్నటువంటి సేవల గురించి తెలుసుకున్నారు సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినారు.. ఆసుపత్రిలో వివిధ విభాగాలలో అందుచున్నటువంటి సేవల గురించి తెలుసుకుని సంతృప్తి చెందడం జరిగింది.. ఇట్టి కలెక్టర్ గారి ఆకస్మిక తనిఖీలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ గారు కలెక్టర్ వెంట ఉన్నారు మరియు జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభు కిరణ్ గారు జిల్లా కలెక్టర్ గారి వెంట పాల్గొన్నారు.

రెండు రోజుల క్రితం దేమే కలాన్ లో ప్రబలిన అతిసార వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామస్థాయిలో వైద్యులు వైద్య సిబ్బంది తగిన ముందుగా చర్యలు చేపట్టి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గారు సూచించారు.. విధుల పట్ల అలసత్వం గానీ అశ్రద్ధ వహించినటువంటి సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ సురేష్ గారు సరిగ్గా అందుబాటులో ఉండడం లేదని కొందరు గ్రామస్తులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువచ్చిన నందున షోకాజ్ నోటీస్ జారీ చేయమని కలెక్టర్ గారు ఆదేశించినారు కలెక్టర్ గారి వెంట మండల ప్రత్యేక అధికారి ఇతర రెవెన్యూ శాఖ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!