హమాలీ కార్మికులకు భద్రత భరోసా కల్పించాలని రాష్ట్ర నాయకునికి వినతి
బెల్లంపల్లి జులై 25(అఖండ భూమి న్యూస):శుక్రవారం తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని నెన్నెల,కన్నెపల్లి,భీముని మండలాల్లో హమాలీ కార్మికులను కలిసి అనంతరం బెజ్జూరు,బెల్లంపల్లి,పెంచికల్ పేట,మండలంలోని హమాలీ కార్మికులందరినీ కలవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కార్మిక రాష్ట్ర అధ్యక్షులు సామ్రాజ్యం హాజరయ్యారు.అనంతరం అయన మాట్లాడుతూ…ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హమాలీ వెల్ఫేర్ బోర్డు విషయమై మంత్రిని కలచిన విషయాన్ని అయన ప్రస్తావించడం జరిగింది.కార్మికులందరూ ఐక్య సంఘటనలో భాగంలో పాల్గొని హమాలీ బోర్డు ఏర్పాటుకు అందరూ ఎకతాటిపై నిలబడి ఐక్యంగా కార్మికుల హక్కులు సాధించుకోవాలని,హమాలీ భద్రతా భరోసా కొరకు అందరూ ఏకం కావాలన్నారు.తదుపరి కార్మికులు మాట్లాడుతూ..రానున్న రోజుల్లో హమాలీ కార్మికులకు భద్రతా భరోసా అలాగే ఐడెంటిటీ కార్డులను పని ప్రదేశ గుర్తింపు కార్డులని ఇప్పించాలని,కార్మిక నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాజ్యం,హమాలి నాయకులు గెల్లి రాజలింగు,కరీంనగర్ జిల్లా బాధ్యులు మోహన్ లను కోరుకోవడం జరిగింది…