కామారెడ్డి లో కిమ్స్, రోటరీ ఐఎంఏ వారి ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం..

కామారెడ్డి లో కిమ్స్, రోటరీ ఐఎంఏ వారి ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం

..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 26 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియం కామారెడ్డిలో రోటరీ క్లబ్, కిమ్స్, ఐఎంఏ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విచ్చేసి ఈ ఉచిత క్యాన్సర్ శిబిరం ద్వారా నిర్వహిస్తున్న వైద్య సేవలను పరిశీలించి జిల్లాలో ఇలాంటి క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు రోటరీ క్లబ్,ఐఎంఏ,కిమ్స్ హాస్పటల్ వారిని అభినందించారు. పేద ప్రజల అధికంగా ఉన్న ఈ జిల్లాలో ఇలాంటి శిబిరాల వల్ల ప్రజల ఆరోగ్యానికి మంచి మేలు జరిగే అవకాశం ఉందని ఇలాంటి శిబిరాలు మరిన్ని నిర్వహించేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో DWO ప్రమీల, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ మధు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఆర్కె గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సీఈఓ డాక్టర్ యం జైపాల్ రెడ్డి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి సిడిపిఓ రాణి హాజరై జ్యోతి ప్రజ్వల చేశారు.

రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా లో కిమ్స్ హాస్పిటల్ వారు ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. దాదాపు 300 మంది ఈ క్యాన్సర్ పరీక్ష చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. జిల్లాలో మొదటి సారి ఈలాంటి శిబిరం నిర్వహించడం వలన చాలా మంది నిరుపేదలకు ఉపయోగపడిందని చెప్పినారు. కిమ్స్ డాక్టర్ మధు మాట్లాడుతూ కామారెడ్డి ఐయంఏ, రోటరీ క్లబ్ వారి సహకారం తో ఉచిత క్యాన్సర్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు అభినందనలు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి భయానిక వ్యాధి కాదని, ప్రజలు క్యాన్సర్ పరీక్షలు చేసుకోవడం వల్ల ముందస్తుగా క్యాన్సర్ మహమ్మారిని అరికటవచ్చు అన్నారు.

 

ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు శంకర్,సెక్రటరీ సబ్బాని కృష్ణ హరి, ట్రెజరర్ వెంకట రమణ,రోటరీ సభ్యులు రాజనర్సింహ రెడ్డి , డా బాలరాజు, సుధాకర్ ,నాగభూషణం నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!