స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు షురూ.. సెప్టెంబరు 30లోపు ఫినిష్..!

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు షురూ.. సెప్టెంబరు 30లోపు ఫినిష్..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 26 (అఖండ భూమి న్యూస్);

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు షురూ. సెప్టెంబరు 30లోపు ఫినిష్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, ఇతర సామగ్రి వివరాలను నిర్ణీత నమూనాలో సమర్పించాలని సూచించింది. ఓటర్ల జాబితా, విడతల వారీ ప్రణాళికను సిద్ధం చేయాలన్న ఎస్ఈసీ.. సెప్టెంబరు 30 లోపు ఎన్నికలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లా యంత్రాంగాలు ఎన్నికల నిర్వాహణకు సన్నాహాలను ప్రారంభించనున్నాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!