శ్రీనగర్: జమ్మూకశ్మీరులో ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం దాడులు చేసింది.(NIA raids) శ్రీనగర్, కుప్వారా, పూంచ్, రాజౌరితో సహా జమ్మూకశ్మీరులోని(Jammu and Kashmir) పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు జరిపింది..
పాకిస్థాన్ కమాండర్లు, హ్యాండ్లర్ల ఆదేశాల మేర నకిలీ పేర్లతో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల కుట్రను(Terror Conspiracy case) ఛేదించేందుకు ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఏప్రిల్ 20వతేదీన పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించారు. భింబర్ గలీ నుంచి సాంగ్యోట్ కు ఆర్మీ వాహనం వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాజౌరి, పూంచ్ సెక్టార్ల చుట్టూ ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని లంజోట్, నికైల్, కోట్లి, ఖుయిరట్టా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు బయటపడ్డాయి. ఉగ్రవాదులు పాకిస్థాన్ సైన్యం వద్ద కమాండో శిక్షణ పొందుతున్నారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దాడుల్లో వెల్లడైంది..



