ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జిల్లా జనరల్ సెక్రటరీ గా సురేష్ బాబు.

ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జిల్లా జనరల్ సెక్రటరీ గా సురేష్ బాబు.

కడప, జులై 28(అఖండ భూమి వెబ్ న్యూస్):-

ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ కడప జిల్లా జనరల్ సెక్రటరీ గా బద్వేల్ కు చెందిన బచ్చల. సురేష్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నేషనల్ చైర్మన్ డా.సాయి రమేష్ తెలియ జేస్తూ ఐడెంటిటీ కార్డ్, అపాయింట్మెంట్ లెటర్, మెంబర్షిప్ సర్టిఫికెట్ ను జిల్లా చైర్మన్ కిషోర్ చేతుల మీదుగా బచ్చల సురేష్ బాబు కు అందించారు .అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ నన్ను కడప జిల్లా జనరల్ సెక్రటరీ గా ఎన్నుకొన్న నేషనల్ చైర్మన్ డా.సాయి రమేష్ కు, స్టేట్ కోఆర్డినేటర్ మద్దెల. సురేష్ బాబు కు, డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్ సి. వి. సుబ్బారెడ్డి కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ప్రతి వినియోగదారుడు మోసపోకుండా ఏదైనా వస్తువును కొనడానికి ముందు జాగ్రత్తలు పాటించాలని, టీవి లలో యాడ్ లు నమ్మి మోసపోకూడదని, మోసపోకుండా ఉండడానికి ఒకవేళ మోసపోతే ఎలా కన్స్యూమర్ ఫోరమ్ లో కేస్ వేయాలన్నారు.ఇవ్వన్నీ ప్రతి కాలేజీ కి వెళ్లి స్టూడెంట్స్ కు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి క్లుప్తంగా వివరిస్తామని చెప్పారు.ఎవరైతే ఏం. ఆర్. పి. రేట్ కంటే ఎక్కువ రేట్ కు అమ్ముతుంటారో వారిపై చర్యలు తీసుకొనేలా చేస్తామని, చాలా మంది దుకాణ దారులు వెయిట్ విషయం లో లోటు పాట్లు ఉన్నాయని వాటిని కూడా త్వరలో వెళ్లి గమనించడం జరుగుతుందని తెలిపారు. త్రాగు నీరు ప్లాంట్స్ లలో ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా జిల్లాలో విచ్చలవిడిగా ఇష్టమొచ్చినట్లు అమ్ముతున్నారని వాటిపై నిఘా ఉంచి జాయింట్ కలెక్టర్ ద్వారా వెళ్లి చెక్ చేసి అలాంటి వారిపై చర్యలు తీసుకోవం జరుతుందని తెలిపారు .ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు ఉమామహేశ్వర్ రావ్, కోట. సుబ్బారావు, చలపతి, శ్రీధర్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!