యర్రగొండపాలెం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి
యర్రగొండపాలెం అఖండ భూమి:పశ్చిమ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని యర్రగొండపాలెంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలని ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ షేక్ ఇస్మాయిల్ కోరారు. ఈ మేరకు సోమవారం ఒంగోలు నగకంలో కలెక్టరేట్లో జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్. అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ముస్లిం యూత్ సొసైటీ ద్వారా రెండు వేల మందికి పైగా వివిధ ప్రమాదవశాత్తు రోగులకు రక్తదానం. చేసినట్లు చెప్పారు. ఈ సేవా కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందంగా, మానవతా దృక్పథంతో జరిగిందని తెలిపారు. పశ్చిమ ప్రాంతంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు, గర్భవతి మహిళలకు తక్షణ అవసరమైన రక్తం లభ్యం కావడంలో అనేక రకాలైన ఇబ్బందులు ఉ న్నాయన్నారు. ఫలితంగా వైద్య సేవల్లో రక్తం అందక ప్రాణాలు పోతున్న ఘటనలు మన కళ ముందే జరుగుతున్నాయని వివరించారు. రక్తం అందించే ఏర్పాట్లు లేకపోవడం అత్యంత బాధాకరం అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో యర్రగొండపాలెంలో బ్లడ్ బ్యాంక్ అనేది ఒక ప్రాణవాయువుగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి మంజూరు చేయాలని ఆయన కోరారు. వినతిపత్రం స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా విచారించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..