నిజాయితీ చాటుకున్న లేడీ కండక్టర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 30, (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన లేడీ కండక్టర్ సువర్ణ తన నిజాయితీని చాటుకున్నారు. బస్సులో మరిచిపోయిన బ్యాగును తిరిగి ప్రయాణికురాలకు అప్పగించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జేబీఎస్ వరకు వెళ్ళింది .అందులో ఎక్కిన ఒక ప్రయాణికురాలు తన బ్యాగును బస్సులో మరిచి జేబిఎస్ లో దిగిపోయారు .బస్సులో ఉన్న బ్యాగును గమనించిన కండక్టర్ సువర్ణ దానిని తీసుకొని తన దగ్గర ఉంచుకున్నారు. బస్సు దిగిపోయినా ప్రయాణికురాలు తన వద్ద బ్యాగు లేదని కనుగుతినిపోయి తిరిగి బస్ స్టాప్ వద్దకు చేరుకున్నారు .అక్కడ ఉన్న కండక్టర్ ను సంప్రదించగా బ్యాగు తన వద్ద ఉందని చెప్పారు. బ్యాగులో నాలుగు తులాల బంగారం ,సెల్ ఫోన్ తో పాటు నగదు ఉండగా వాటిని ప్రయాణికురాలకు కండక్టర్ సువర్ణ అప్పగించారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ సువర్ణను పలువురు ప్రయాణికులు అభినందించి అక్కడ ఆమెకు మిఠాయిలు తినిపించారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



